కెప్టెన్ కోహ్లీకి అరుదైన గౌరవం...కపిల్‌, సచిన్ ల తరువాత

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 04:40 PM

కెప్టెన్ కోహ్లీకి అరుదైన గౌరవం...కపిల్‌, సచిన్ ల తరువాత

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. వన్డేల్లో గత కొన్నేళ్లుగా అత్యుత్తమంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ.. విజ్డెన్ దశాబ్దపు క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2010-2020 మధ్యకాలంలో వన్డేల్లో అసాధారణరీతిలో విరాట్ కోహ్లీ శతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ దశాబ్దంలో దాదాపు 60 సగటుతో పరుగులు రాబట్టిన కోహ్లీ ఏకంగా 11,000 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు ఉన్నాయి.

ఫస్ట్ ఇంటర్నేషనల్ వన్డే జరిగి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా విజ్డెన్.. అప్పటి నుంచి దశాబ్దానికి ఒకరు చొప్పున ఆటగాళ్లని ఎంపిక చేసింది. ఈ క్రమంలో 1970-80 దశాబ్దానికిగానూ వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఎంపికవగా.. 1980-90 దశాబ్దానికి భారత దిగ్గజం, దేశానికి మొదటి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్‌దేవ్‌కి ఈ గౌరవం దక్కింది. ఇక 1990-2000 దశాబ్దానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంపికవగా.. 2000-2010 దశాబ్దానికి శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్ మురళీధరన్‌కి ఈ గౌరవం దక్కింది. తాజాగా 2010-2020 దశాబ్దానికి కోహ్లీ ఎంపికయ్యాడు.

1983లో భారత్‌కి ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్.. ఆ దశాబ్దంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక 1998లో సచిన్ టెండూల్కర్ ఏకంగా 9 శతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements