గాంధీ ఆస్పత్రిలో అవుట్ పేషంట్ సేవలుబంద్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 05:39 PM

గాంధీ ఆస్పత్రిలో అవుట్ పేషంట్ సేవలుబంద్

గాంధీ ఆస్పత్రిలో రేపటినుంచి అవుట్ పేషంట్ సేవలు అందుబాటులో ఉండవని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గాంధీ ఆస్పత్రికి కరోనా పేషంట్లు ఎక్కువగా వస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకొక కరోనా పేషంట్ గాంధీలో చేరుతున్నారు. ఇప్పటికే గాంధీలో వెంటిలేటర్లు, బెడ్లు ఫుల్ అయ్యాయి. దాంతో శనివారం నుంచి గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని హెల్త్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగుల కోసం ఇతర డిపార్ట్‌మెంట్ల పేషంట్లను ఖాళీ చేయిస్తున్నారు. ఎలెక్టివ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే ట్రీట్మెంట్ అందించమని హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదేశించింది. ఇప్పటికే గాంధీలో 450కి పైగా కరోనా పేషెంట్స్ ఉన్నారు. గురువారం ఒక్కరోజే 150 మంది అడ్మిట్ అయ్యారు. ఇన్‌పేషంట్ బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్‌తో నిండిపోయింది.





Untitled Document
Advertisements