పేషెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించిన జగన్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 06:42 PM

ఏపీలోని ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని చెప్పారు. ఈరోజు వైద్యాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ విధించకుండానే కరోనాను కట్టడి చేసే అంశంపై చర్చించారు.

రాష్ట్రంలోని అర్భన్ ప్రాంతాల్లో 62 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కోవిడ్ కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే మరణాలు అధికంగా నమోదవుతున్నాయని సీఎంకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఆలస్యంగా ఆసుపత్రులను ఆశ్రయించడమే దీనికి కారణమని చెప్పారు.

ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంట్లో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రులను పర్యవేక్షించాలని చెప్పారు. కరోనా పేషెంట్లకు నాణ్యమైన భోజనం, శానిటైజేషన్ పై దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు.





Untitled Document
Advertisements