కారు కొనే వారికి మారుతీ సుజుకీ ఝలక్... కస్టమర్లకు చుక్కలు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 11:48 AM

కారు కొనే వారికి మారుతీ సుజుకీ ఝలక్... కస్టమర్లకు చుక్కలు

కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూ్స్. దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కస్టమర్లకు షాకిచ్చింది. కార్ల ధరలను పెంచేసింది. దీంతో కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

మారుతీ తన కార్ల ధరలను ఏకంగా రూ.22,500 వరకు పెంచేసింది. ఎంపిక చేసిన మోడళ్లకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 16 నుంచే పెరిగిన రేట్లు అమలులోకి వచ్చాయని కంపెనీ పేర్కొంది. దీంతో ఇప్పుడు కారు కొనాలనుకునే వారు ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సిందే.

ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం వల్ల కార్ల ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. ఎక్స్‌షోరూమ్ ధరలో 1.6 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. సెలెరియో, స్విఫ్ట్ మోడల్స్ మినహాయించి మిగతా అన్నీ కార్ల ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది.

మారుతీ సుజుకీ జనవరి నెలలో కూడా కార్ల ధరలను పెంచేసింది. అప్పుడు కార్ల ధర రూ.34 వేల వరకు పెరిగింది. 3 నెలల్లోనే మళ్లీ కార్ల ధరలను మరోసారి పెంచేసింది. దీంతో కారు కొనే వారి జేబుకు చిల్లులు పడనున్నాయి. మారుతీ కారు కొనే వారిపై అధిక ప్రభావం ఉండనుంది.





Untitled Document
Advertisements