సమయానికి భోజనం చేయకపోతే? ఎంజరుగుతుందో చూడండి!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 12:19 PM

సమయానికి భోజనం చేయకపోతే? ఎంజరుగుతుందో చూడండి!

సూర్యోదయ, సూర్యాస్తమయాలను బట్టి మన శరీరానికి ఒక నియమిత కాలంలో భోజనం అందించాలి. అప్పుడే అది సక్రమంగా జీర్ణమై ఒంటికి పడుతుంది.అలా కాకుండా మనకు ఇప్పుడు వీలుంటే అప్పుడు, ఏది దొరికితే అది, అర్ధరాత్రి, అపరాత్రి తినడం మంచిదికాదు. ఈనాడు ప్రతీ ఒక్కరూ చేస్తున్నా అతిపెద్ద తప్పు ఇదే కానీ, తప్పనిసరి పరిస్థితులలో తప్పడం లేదు.
మన శరీరం మన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ప్రకృతిని బట్టి నడుచుకుంటూ ఉంటుంది. ఈ మానవ యంత్రం సూర్యోదయానికి ముందే మేల్కొని సూర్యాస్తమయంలో ఈ యంత్రం ఆగిపోతూందన్న సత్యాన్ని అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. మానవుడు ప్రకృతి కనుసన్నలలోనే నడవాల్సి ఉంటుంది. ప్రకృతికి దగ్గరగానే జీవించాలి. పంచాభుతాలతో నిర్మితమైన ఈ దేహం, ప్రకృతి నియమానుసారంగానే జీవిస్తుంది. పూర్తిగా ప్రకృతి పై ఆధారపడి జీవిస్తుంది అని చెప్పవచ్చును.
పగలు, రాత్రి ఎందుకు? పగలు పని చేయడానికి, రాత్రి నిద్రించటానికి. ఈ నియమాన్ని పాటించినంతకాలం మనిషికి ఎలాంటి అనారోగ్యం ఏర్పడదు. మన పూర్వీకులు ఈ నియమాన్ని పాటించి ఆరోగ్యంగా నూరేళ్ళు తమ జీవితాలను సుఖ సంతోషాలతో గడిపారు.
నేటి తరం వారు చేసే పనులన్నీ విరుద్దంగా ఉన్నాయి. పని ఉన్నా లేకున్నా స్నేహితులతో కాలక్షేపం చేయడం, రాత్రంతా టి.వి చూస్తూ లేదా ఫోన్ చూస్తూ గడపడం చేస్తున్నారు. పగలంతా నిదురపోవడం చేస్తున్నారు. నేడు కొంతమంది చేస్తున్నా ఉద్యోగాలు కూడా ఇలానే ఉన్నాయి. రాత్రి వేళలో పని చేయాల్సివస్తుంది.
ఈ విరుద్దమైనా చర్యవల్ల శరీరంలో శ్లేష్మం ప్రకోపించి, క్షయ, తలనొప్పి, ఉబ్బసం, సైనసైటీస్, ఆకలి తగ్గిపోవడం ఇటువంటి వుఆదులు ప్రబలుతున్నాయి. వేళకాని వేళ భుజించడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక అజీర్ణ వ్యాధులు, అతిసారంతో శరీరం నీరసించిపోతుంది. యాంత్రిక జీవనంలో మనిషి ఉరుకుల పరుగులతో తిని, తినక హడవిడిగా పరుగులు పెడుతూ.. మానసిక శ్రమ ఎక్కువగా చేస్తూ నిద్ర నియమాలు అలక్ష్యం చేస్తున్నారు. రాత్రిపూట ఉద్యోగం అనేది ఉద్యోగి శరీరాన్ని నీరసింపజేస్తుంది. డబ్బులున్న తినటానికి సమయం లేక, తిన్నా నిద్రించటానికి వీలు లేక ఎన్నో భాదలకు లోనైపోతున్నారు. శారీరక శ్రమ చేసే వారికి వారు తిన్న ఆహారం జీర్ణం అవుతుంది.ప్రశంతమైన నిద్ర పడుతుంది. పరిపూర్ణ ఆరోగ్యం ఆయువుతో వర్ధిల్లుతారు. ఇది ప్రకృతి సిద్ధాంతం. ఈ సృష్టి నియమాలను ఉల్లంఘించినప్పుడు ఎన్నో దుష్పలితాలను ఎదుర్కోవలసి వస్తుంది.
భోజనం చేసిన వెంటనే శరీరంలోనికి ఆహారం చేరగానే ఆ ఆహారాన్ని జీర్ణం చేయటం కోసం మన శరీరంలోని భాగాలన్నీ చురుకుగా పని చేయడం మొదలుపెడతాయి. అందుకీ మనకు మగత నిద్ర వస్తుంది. ఆ నిమిషంలో ఓ అరగంట కునుకు తీస్తే శరీరానికి ఉత్తేజం. ఉత్సాహం కలుగుతాయి. అదే ఎక్కువసేపు నిద్రపోతే తిన్న ఆహారం ఎక్కువగా కొవ్వుగా మారి పొట్ట, నడుము, తొడలు, వీపు దగ్గర కొవ్వు నిలువలు పెరిగిపోయి అసహ్యంగా తయారై రోగాలకు మూలం అవుతుంది.అందుకే తిన్న వెంటనే కనీసం వంద అడుగులు తప్పక నడవాలి. అప్పుడే కడుపు ఉబ్బరం, తేపులు, గ్యాసు భాదలు ఉండవు.
రాత్రిపూట పని చేసేవారు ఉదయం పుట నిద్రపోవచ్చు. మధ్యాహాన్నం భోజనానికి ముందే నిదురపోతే మంచిది. భోజనం తరువాత కన్నా ముందే నిదురపోతే మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా చేయటం వల్ల శరీరంలోని వృధా పదార్దాలన్ని అతి వేగంగా హరించిపోతాయి.
ఏ శారీరక శ్రమ చేయనివారు, తిని కూర్చునేవారు విపారీతంగా లావుగా ఉన్నవారు పగలు నిద్రపోకూడదు. నేడు ఎందరో మానసిక ఒత్తిడికి గురై నిద్రలేమితో భాదాపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నిద్ర మాత్రలు వాడుతున్నారు. ఇలా కాకుండా తగినంత సమయానికి శుచిగా స్నానం చేసి వేడివేడిగా భుజించి, ఓ గంటసేపు ఏదైనా పుస్తకం తీసుకుని చదివి, పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే చక్కగా నిద్రపడుతుంది.





Untitled Document
Advertisements