నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...పది అర్హతతో 40,000కు పైగా పోలీస్ ఉద్యోగాలు!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 01:16 PM

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...పది అర్హతతో 40,000కు పైగా పోలీస్ ఉద్యోగాలు!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 జాబ్‌ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ షెడ్యూల్‌‌ను మార్చి 25న విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేదు. అయితే దీనికి సంబంధించిన అన్నీ ప్రక్రియలు పూర్తి చేసి ఏప్రిల్‌ చివర్లో లేదా మే నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌‌ ప్రకటించింది.

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌ఎసీ‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఇటీవల కమిషన్‌ వెల్లడించిన ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం మే 10న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. అలాగే.. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. అయితే ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Online Written Examination), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination)ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

ఇక ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. సో.. ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించడం మంచిది.





Untitled Document
Advertisements