క్రేజీ జోడీతో మరో సినిమా ప్లాన్

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 01:47 PM

క్రేజీ జోడీతో మరో సినిమా ప్లాన్

వైష్ణవ్ తేజ్- కృతి శెట్టి జంటగా సిల్వర్ స్క్రీన్‌పై తెలుగు ప్రేక్షకులకు రొమాంటిక్ కిక్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరికీ వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. మెగా మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా మొదటి సినిమాతోనే పాపులారిటీ కూడగట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ కృతి శెట్టి సైతం తొలి సినిమానే అయినా తనదైన లుక్స్, నటనా ప్రతిభతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంది. ఇక ఈ ఇద్దరూ పండించిన రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ జోడీతో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడట ఓ నూతన దర్శకుడు.

సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా 'ఉప్పెన'తో భారీ హిట్ అందుకున్నారు. వైష్ణవ్ తేజ్- కృతి శెట్టిలను వెండితెరపై మెరిపించారు. దీంతో ఇప్పుడు అదే జోడీతో సుకుమార్ మరో శిష్యుడు రంగంలోకి దిగబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్- కృతి శెట్టిలతో రెట్టింపు డోస్ రొమాన్స్ పండించబోతున్నారాట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. తనకు హిట్ ఇచ్చిన హీరో వైష్ణవ్‌తో మరో సినిమా అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసిందట కృతి శెట్టి. సో.. ఇదే నిజమైతే ఈ జోడీకి ఇప్పటికే ఉన్న పాపులారిటీ అమాంతం పెరగడం ఖాయమే మరి.





Untitled Document
Advertisements