కారు కొనే వారికి అదిరే ఆఫర్...తక్కువ EMI తో హెచ్‌డీఎఫ్‌సీ రుణాలు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 03:38 PM

కారు కొనే వారికి అదిరే ఆఫర్...తక్కువ EMI తో హెచ్‌డీఎఫ్‌సీ రుణాలు

కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. తక్కువ ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. కారు కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ల కోసం కస్టమ్ ఫిట్ లోన్స్ అందిస్తోంది. కస్టమర్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, అలాగే భవిష్యత్ ఆదాయ అంచనాల ప్రాతిపదికన ఈ రుణాలు పొందొచ్చు. ఈ తరహా రుణాలు తీసుకుంటే రానున్న కాలంలో ఈఎంఐ పెరుగుతూ వస్తుంది.

బ్యాంక్ అందిస్తున్న కస్టమ్ ఫిట్ లోన్స్‌లో భాగంగా మారుతీ సుజుకీ ఇండియాకి చెందిన చౌక కారు మారుతీ ఆల్టో 800ను రూ.3 వేల ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లొచ్చు. బ్యాంక్ అందించే ఈఎంఐ ఆఫర్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


తొలి ఆరు నెలల కాలానికి రూ.లక్ష రుణ మొత్తానికి రూ.899 ఈఎంఐ పడుతుంది. 7 నెలల నుంచి 36 నెలల కాలానికి ఈఎంఐ రూ.లక్షకు రూ.3717గా ఉంటుంది. ఇది ఒక ఈఎంఐ ఆప్షన్. ఇలా కాకుండా మరో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇది 7 ఏళ్ల కాల పరిమితితో లోన్ తీసుకుంటే వర్తిస్తుంది. తొలి 12 నెలలకు రూ.లక్షకు రూ.1111 ఈఎంఐ పడుతుంది. 13 నెలల నుంచి 24 నెలల వరకు రూ.లక్షకు రూ.1222 ఈఎంఐ పడుతుంది. 25 నెలల నుంచి 36 నెలలకు లక్షకు రూ.1444 ఈఎంఐ చెల్లించాలి. తర్వాత 37 నెలల నుంచి 48 నెలలకు రూ.లక్షకు రూ.1666 ఈఎంఐ పడుతుంది. 49 నెలల నుంచి 60 నెలల కాలానికి రూ.లక్షకు రూ.1888 ఈఎంఐ కట్టాలి. 61 నెలల నుంచి 83 నెలల వరకు రూ.లక్షకు రూ.1999 ఈఎంఐ పడుతుంది. 84వ నెల రూ.లక్షకు రూ.9999 ఈఎంఐ కట్టాలి.


ఇవే కాకుండా మరో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ప్రతి ఏడాది ఈఎంఐ 10 శాతం పెంచుకుంటూ వెళ్లే ఆప్షన్ ఇది. లోన్ టెన్యూర్ 7 ఏళ్లు ఉంటుంది. ఇందులో తొలి ఏడాది ఈఎంఐ రూ.లక్షకు రూ.1234గా ఉంది. ప్రతి ఏడాది ఈఎంఐ 10 శాతం పెరుగుతూ వస్తుంది. 7వ ఏడాది రూ.లక్షకు రూ.2219 ఈఎంఐ పడుతుంది. ఇది కాకుండా మరో ఆప్షన్ ఉంది. ప్రతి ఏడాది తొలి మూడు నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు. మిగతా కాలం ఈఎంఐ చెల్లించాలి.





Untitled Document
Advertisements