కుంభమేళాలో కరోనా ప్రసాదం?!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 03:44 PM

కుంభమేళాలో కరోనా ప్రసాదం?!

కరోనా సెకండ్‌ వేవ్ విలయతాండవంతో మహారాష్ట్ర వణికిపోతోంది. రోజుకి 60 వేలకి పైగా కేసులు నమోదవుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రులకు రోగులు క్యూలు కడుతుండడంతో బెడ్లు కూడా దొరకని పరిస్థితి. ఓ వైపు కరోనా వ్యాక్సిన్లు అయిపోతోంటే.. మరోవైపు మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో హరిద్వార్ కుంభమేళా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

కుంభమేళాలో కరోనా ప్రబలడంతో అక్కడి నుంచి వచ్చే భక్తులతో కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ముంబై వాసులు భయపడుతున్నారు. కుంభమేళాను ఉద్దేశించి ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన భక్తులు కరోనాను ప్రసాదంలా పంచుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళా నుంచి వచ్చిన భక్తులు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆమె సూచించారు.

కుంభమేళా నుంచి ముంబైకి వచ్చిన భక్తులను గుర్తించి క్వారంటైన్‌కి తరలిస్తున్నట్లు మేయర్ కిశోరి తెలిపారు. నగరంలో 95 శాతం మంది కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నారని.. మిగిలిన 5 శాతం మందితోనే సమస్యలు వస్తున్నాయని ఆమె అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ విధించడమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements