ఆన్‌లైన్ సర్వీసులు బంద్!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 04:46 PM

ఆన్‌లైన్ సర్వీసులు బంద్!

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ కస్టమర్లకు రేపు సర్వీసులకు అంతరాయం కలుగనుంది. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ 18న రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ RTGS సర్వీసులు అందుబాటులో ఉండవని తెలిపింది.

ఏప్రిల్ 18న అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్‌టీజీఎస్ సర్వీసులు అందుబాటులో ఉండవు. ఆర్‌టీజీఎస్ ఫెసిలిటీలో టెక్నికల్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతోందని ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. ఆర్‌బీఐ ఇప్పటికే బ్యాంకులకు ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.

అయితే బ్యాంక్ కస్టమర్లకు నెఫ్ట్ NEFT సర్వీసులు మాత్రం అందుబాటులోనే ఉంటాయి. ఎవరికైనా డబ్బులు పంపించుకోవాలంటే నెఫ్ట్ ద్వారా పంపాలి. రూ.2 లక్షలకు లోపు అయితే నెఫ్ట్ వాడతారు. నెఫ్ట్ ట్రాన్సాక్షన్ల ద్వారా రోజుకు రూ.25 లక్షల వరకు పంపగలం. అదే రూ.2 లక్షలు లేదా ఆపైన డబ్బులు ఎవరికైనా పంపాలంటే ఆర్టీజీఎస్ ఫెసిలిటీ ఉపయోగిస్తారు.





Untitled Document
Advertisements