దేశంలో త్వరలో మోటో జీ60, జీ40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లు లాంచ్

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 07:01 PM

దేశంలో త్వరలో మోటో జీ60, జీ40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లు లాంచ్

మోటో జీ60, జీ40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో ఏప్రిల్ 20వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది. వీటికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఆన్ లైన్‌లో లీకయ్యాయి. ఈ రెండు ఫోన్లలోనూ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. మోటో జీ60లో 108 మెగాపిక్సెల్ కెమెరా, మోటో జీ40 ఫ్యూజన్ ప్లస్‌లో 64 మెగాపిక్సెల్ కెమెరాలను వెనకవైపు అందించనున్నారు.

మోటొరోలా వీటికి సంబంధించిన టీజర్లను ట్వీటర్‌లో టీజ్ చేసింది. వీటికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఏప్రిల్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. వీటికి సంబంధించిన సేల్ ఫ్లిప్ కార్ట్‌లో జరగనుంది.

మోటో జీ60 కీలక స్పెసిఫికేషన్లు ట్వీటర్, ఫ్లిప్‌కార్ట్‌లో టీజ్ చేశారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.8 అంగుళాల హోల్ పంచ్ డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. ఇందులో వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ మాక్రో/అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందువైపు హోల్ పంచ్ కటౌట్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఇక మోటో జీ40 విషయానికి వస్తే.. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. దీంతోపాటు మోటో జీ60లో ఉండే డిస్ ప్లే, ప్రాసెసరే ఇందులో కూడా ఉండనుంది. మొబైల్ సెక్యూరిటీ కోసం మోటొరోలా థింక్ షీల్డ్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. మోటో జీ60 బ్లూ, గ్రే రంగుల్లోనూ, మోటో జీ40 గ్లాసీ బ్లూ, బ్లాక్ రంగుల్లోనూ అందుబాటులో ఉండనుంది.


రెండు ఫోన్లకూ కుడివైపున మూడేసి బటన్లు అందించారు. వీటిలో రెండు బటన్లు వాల్యూమ్, పవర్ బటన్లు కాగా, మూడోది గూగుల్ అసిస్టెంట్ బటన్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్లూ ఇటీవలే గీక్ బెంచ్‌లో కనిపించాయి. మోటో జీ60 6 జీబీ ర్యామ్‌తోనూ, మోటో జీ40 ఫ్యూజన్ 4 జీబీ ర్యామ్‌తోనూ కనిపించాయి.





Untitled Document
Advertisements