MI vs SRH: బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై...బోణీ కోసం SRH ఎదురుచూపులు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 07:11 PM

MI vs SRH: బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై...బోణీ కోసం SRH ఎదురుచూపులు

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబయి తుది జట్టులో రోహిత్ శర్మ ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ జాన్సన్ స్థానంలో ఆడమ్ మిల్నే టీమ్‌లోకి వచ్చాడు. చెపాక్‌లో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లు జరగగా ఇందులో ఒక మ్యాచ్‌లో మాత్రమే ఛేదనకు దిగిన జట్టు విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోనూ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నాలుగు మార్పులు చేశాడు.

ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చిట్టచివరి స్థానంలో ఉంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబయి, హైదరాబాద్ జట్లు రెండు మ్యాచ్‌ల్లో తలపడగా..చెరొక మ్యాచ్‌‌లో విజయం సాధించాయి.

రికార్డుల పరంగా చూసుకుంటే ముంబయి, హైదరాబాద్ జట్లు పోటాపోటీగా ఐపీఎల్‌లో తలపడుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 16 మ్యాచ్‌ల్లో ఢీకొనగా.. చెరో 8 మ్యాdచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టీమ్స్ సాధించిన స్కోర్లని ఓసారి పరిశీలిస్తే..? హైదరాబాద్‌పై ముంబయి చేసిన అత్యధిక స్కోరు 208 పరుగులుకాగా.. ముంబయిపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 178 పరుగులు మాత్రమే. బౌలింగ్‌ పరంగా రెండు జట్లూ బలంగా ఉన్నాయి.

Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Rahul Chahar, Adam Milne, Jasprit Bumrah, Trent Boult





Untitled Document
Advertisements