కరోనా నియంత్రణపై హైకోర్టు సీరియస్...జనసంచారం నియంత్రణకు ఏం చర్యలు?!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 12:50 PM

కరోనా నియంత్రణపై హైకోర్టు సీరియస్...జనసంచారం నియంత్రణకు ఏం చర్యలు?!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సినిమా హాల్‌లు, పబ్బులు బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టు వెల్లడించింది.

పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని సూటిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ హై కోర్టుకు తెలియజేశారు. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ? అని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా? అని హైకోర్టు హెచ్చరించింది.
ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నం లోగా నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.





Untitled Document
Advertisements