మూడు లక్షలకి చేరువలో కొత్త కేసులు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 12:54 PM

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. నిన్నటి వరకు రెండు లక్షల వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య సైతం పెరుగుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 13 లక్షల 56 వేల మందికి పైగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,73,810 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే మూడు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,50,61,919 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 1,619 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,78,769 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,44,178 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,29,53,821 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 19,29,329 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి





Untitled Document
Advertisements