కలెక్షన్ సెంటర్లుగా పోలీస్‌స్టేషన్లు.... ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 04:04 PM

కలెక్షన్ సెంటర్లుగా పోలీస్‌స్టేషన్లు.... ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పోలీస్‌స్టేషనా.. కలెక్షన్ సెంటరా?..అంటూ నాగర్‌ కర్నూలు పోలీసులకు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారాయి.

పోలీసులు కల్తీ కల్లు, ఇసుక దందా ముఠాలతో అంట కాగుతున్నారని వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, అంతటితో ఆగకుండా తాను పార్టీని వీడుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్లే ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందని విమర్శించారు.

రైతుల తరపున నిలబడిన తన కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని దామోదర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఎస్పీతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందని, ఫ్రెండ్లీ పోలీస్ అంటే తప్పుడు కేసులు పెట్టడమేనా? అని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనూ ఉంటూ తన కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. పోలీసులు తన కార్యకర్తలను టార్గెట్ చేస్తే సహించలేదని దామోదర్‌రెడ్డి హెచ్చరించారు.





Untitled Document
Advertisements