సుకుమార్, విజయ దేవరకొండ సినిమా కాన్సిల్?!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 05:03 PM

సుకుమార్, విజయ దేవరకొండ సినిమా కాన్సిల్?!

విభిన్నమైన కథాంశంతో.. ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాలు చేయడంలో దర్శకుడు సుకుమార్ ఎక్స్‌పర్ట్. సుకుమార్ సినిమా అంటేనే అందులో కావాల్సినంత కంటెంట్ ఉంటుంది. అందుకే చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతీ ఒక్కరు సుకుమార్ డైరెక్షన్‌లో చేయాలని ఆశపడుతుంటారు. అయితే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే పుష్ప టీజర్ విడుదలై సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. అయితే పుష్ప తర్వాత సుకుమార్.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడని ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం విజయ్.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం విజయం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ్ కూడా పొందాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలను తుది దశకు చేరుకున్నా.. విజయ్-సుకుమార్ సినిమా గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్ బయటకు రాలేదు. దీంతో సినిమా వాయిదా పడిందని.. లేదు పూర్తిగా ఆగిపోయిందని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తోంది. ఈ సినిమాపై వస్తున్న పుకార్లను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని, విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించింది. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ - సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్‌లో వెల్లడించింది.


Untitled Document
Advertisements