నా జన్మదిన వేడుకలు వద్దు. మీరంతా క్షేమంగా ఉంటే అదే కానుకగా భావిస్తా: చంద్రబాబు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 05:53 PM

నా జన్మదిన వేడుకలు వద్దు. మీరంతా క్షేమంగా ఉంటే అదే కానుకగా భావిస్తా: చంద్రబాబు

ఏప్రిల్ 20న టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. అయితే, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ఎవరూ తన జన్మదినం సందర్భంగా సమావేశాలు నిర్వహించవద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
నా జన్మదినానికి ఒక ప్రత్యేకత తీసుకువచ్చేందుకు మీరందరూ నిర్వహించే కార్యక్రమాలు అభినందనీయమే. అందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. అందుకే నా జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని టీడీపీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి అందరూ భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకు అందించే జన్మదిన కానుకగా భావిస్తాను అని చంద్రబాబు పేర్కొన్నారు.

Untitled Document
Advertisements