మలయాళంలో నజ్రియా నజీమ్ కుర్రాళ్ల కలల రాణి

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 05:57 PM

మలయాళంలో నజ్రియా నజీమ్ కుర్రాళ్ల కలల రాణి

మలయాళంలో నజ్రియా నజీమ్ కుర్రాళ్ల కలల రాణి. నవరసాలు ఆమె కళ్ల వాకిళ్లలో ఆరబోసినట్టుగా అనిపిస్తుంది. ఆమె కళ్లకు కోట్లాది మంది ఆరాధకులు ఉన్నారు. ఆమె చూపుల ప్రవాహంలో కొట్టుకుపోయే క్షణాల కోసం ఎదరు చూసే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అలాంటి నజ్రియా హీరోయిన్ గా పదేళ్లపాటు మలయాళ చిత్రపరిశ్రమను ఊపేసింది. తమిళంలో కూడా చేసింది గానీ .. చాలా తక్కువ. ఇక తెలుగులో ఇంతవరకూ చేయకపోయినా, ఆమెకు అభిమానులు ఉండటం విశేషం.
అలాంటి నజ్రియా తెలుగులో మొదటిసారిగా ఒక సినిమాను అంగీకరించింది .. ఆ సినిమా పేరే 'అంటే .. సుందరానికీ'. నాని కథానాయకుడిగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నజ్రియాను తీసుకున్నారు. ఈ రోజునే ఆమె ఈ సినిమా షూటింగులో జాయినైంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. తెలుగులో తన ఫస్టు సినిమా 'అంటే .. సుందరానికీ' కనుక, తనకి ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Untitled Document
Advertisements