వాహనదారులకు శుభవార్త...పెట్రోల్‌పై క్యాష్‌బ్యాక్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:11 PM

వాహనదారులకు శుభవార్త...పెట్రోల్‌పై క్యాష్‌బ్యాక్

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీని వల్ల వాహనదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఇక్కడ వాహనదారులకు ఊరట కలిగే అంశం ఒకటుంది. టూవీలర్ కలిగిన వారికి ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

ఫోన్‌పే వాహనదారులకు ఈ వెసులుబాటు కల్పిస్తోంది. వాహనానికి పెట్రోల్ కొట్టిస్తే నెలకు గరిష్టంగా రూ.150 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి వాటిల్లో మీరు ఎక్కడైనా పెట్రోల్ పోయించుకోవచ్చు.


వాహనదారులు ఒక లావాదేవీలపై రూ.45 వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఇలా నెలకు రూ.150 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 2021 జూన్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే క్యా్ష్‌బ్యాక్ పొందాలని భావించే వారు పెట్రోల్ డబ్బులను ఫోన్‌పే ద్వారా చెల్లించాలి.

అంటే మీరు మీ వాహనానికి పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఫోన్‌పే ద్వారా అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు చెల్లించాలి. మీ క్యాష్ బ్యాక్ డబ్బులు 24 గంటల్లోగా మీకు వస్తాయి. ఒకవేళ పెట్రోల్ బంకులో క్యూఆర్ కోడ్ స్కా్న్ లేకపోతే ఫోన్‌పే ద్వారా రిక్వెస్ట్ పెట్టించుకొని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.

Untitled Document
Advertisements