షర్మిల దీక్షలో కరోనా కలకలం...దీక్ష ముగిసిన తర్వాత ఒక్కొక్కరికి పాజిటివ్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:18 PM

షర్మిల దీక్షలో కరోనా కలకలం...దీక్ష ముగిసిన తర్వాత ఒక్కొక్కరికి పాజిటివ్

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష కలకలం రేపుతోంది. దీక్షలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటంతో ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఈ దీక్షలో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు సుమారు 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అందరూ కోవిడ్ టెస్టులు చేయించుకునేందుకు క్యూ కడుతున్నారు.


తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడ్రోజుల క్రితం దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల ఆదివారం తన దీక్షను విరమించారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు, నిరుద్యోగులు తరలివచ్చారు. దీక్ష విరమణ తర్వాత పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో దీక్షలో షర్మిల వెంటే ఉన్న పిట్టా రాంరెడ్డితో పాటు మరో ఇద్దరు అనుచరులు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. సోమవారం మరికొంత మందికి పాజిటివ్ రావడంతో కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తమైన షర్మిల మూడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements