ప్రపంచపు తొలి గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ఇదే...

     Written by : smtv Desk | Sat, Dec 16, 2017, 04:17 PM

ప్రపంచపు తొలి గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ఇదే...

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్‌ ఇండియా శుక్రవారం 'ప్రీడేటర్‌ 21 ఎక్స్‌' పేరుతో నూతన గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. విండోస్‌ 10 ఆధారితంగా రూపొందించిన కర్వ్‌డ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతో వచ్చిన ప్రపంచపు తొలి గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ఇదే కావడం దీని ప్రత్యేకత. దీని ధర రూ.6,99,999గా కంపెనీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన ఈ ల్యాప్‌ట్యాప్‌, డిసెంబర్‌ 18 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ల్యాప్‌టాప్‌ను మొదటగా బెర్లిన్‌లో 2016 ఐఎఫ్‌ఏలో ప్రవేశపెట్టారు. అయితే అమెరికాలో దీని ధర 8,999 డాలర్లు అంటే రూ.5,77,000గా ఉంది.

ప్రీడేటర్‌ 21 ఎక్స్‌ ఫీచర్లు ఇలా...
# 21 అంగుళాల కర్వ్‌డ్‌ ఫుల్‌-హెచ్‌డీ ఆల్ట్రావైడ్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే
# జీ-సింక్‌ సపోర్టు
# 2560x1080 పిక్సెల్స్‌ రెజుల్యూషన్‌
# 7వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7-7820హెచ్‌కే ప్రాసెసర్‌
# 64జీబీ ర్యామ్‌, 512GBతో వర్క్ చేసే నాలుగు సెపరేట్ డైవ్స్, 1టీజీబీ 7200ఆర్‌పీఎం హార్డ్‌ డ్రైవ్‌
# 8.5 కిలోగ్రాముల బరువు
# ఆరు బిల్ట్‌-ఇన్‌ స్టీరియో స్పీకర్లు





Untitled Document
Advertisements