భారత మాజీ ప్రధాన మంత్రికి కరోనా

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:55 PM

భారత మాజీ ప్రధాన మంత్రికి కరోనా

భారత మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించారు. కరోనా సెకండ్‌ వేవ్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలని కోరుతూ నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. వ్యాక్సినేషన్ మాత్రమే కరోనా కట్టడికి ప్రధాన ఆయుధమన్న మన్మోహన్.. వ్యాక్సినేషన్ అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరారు. కేంద్రం వద్ద కేవలం పది శాతం వ్యాక్సిన్లు ఉంటే సరిపోతుందని.. మిగిలిన వాటిని రాష్ట్రాలకు పంపించేయాలని ఆయన పలు సూచనలు చేశారు. మరుసటి రోజే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో ఆస్పత్రికి తరలించారు.

Untitled Document
Advertisements