‘సలార్‌’లో శృతి హాసన్ రోల్ రివీల్?

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 07:43 PM

‘సలార్‌’లో శృతి హాసన్ రోల్ రివీల్?

కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కే.జీ.ఎఫ్’ చిత్రం యావత్ భారత సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. అసలు ఒక సినిమా ఈ రేంజ్‌లో తీయవచ్చా.. అనే స్థాయిలో కే.జీ.ఎఫ్ తొలి ఛాప్టర్‌ని రూపొందించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆ సినిమా సినిమా సీక్వెల్ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’ పనుల్లో అతను బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2 టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.


ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ అనే సినిమా చేయబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను లాంచ్ చేశారు. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమా నుంచి ఎప్పుడు అప్‌డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది.

సాధారణంగా ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. దీన్ని ‘సలార్’ సినిమాతో చెరిపేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట అతను. అందుకోసం శృతి హాసన్‌కి ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రను రాసుకున్నాడట. అంతేకాక.. ఆమెతో ఈ సినిమాలో భారీగా యాక్షన్ సీన్లు చిత్రీకరించాలనే ప్లాన్‌లో ప్రశాంత్ ఉన్నట్లు సమాచారం.

ఇక కే.జీ.ఎఫ్‌ను నిర్మించిన హంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సలార్ కూడా రూపొందనుంది. రవి బాసుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటించే ఇతర తారాగణం గురించి ఇప్పటికైతే ఎటువంటి సమాచారం లేదు.

Untitled Document
Advertisements