మాస్ పెట్టుకోమన్నందుకు పోలీసులతో మహిళ హల్ చల్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 07:47 PM

మాస్ పెట్టుకోమన్నందుకు పోలీసులతో మహిళ హల్ చల్

‘‘నా భర్తను కారులో ముద్దు పెట్టుకుంటా, ఏం చేస్తావ్?’’ అంటూ ఓ మహిళ ఢిల్లీ పోలీసులపై చిందులేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశారు. అయితే, ఆ జంట మాస్క్ ధరించకుండా కారులో తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఆ కారును ఆపి మాస్కులు ధరించాలని సూచించారు. ఈ మాట ఆ జంటకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా మహిళ పోలీసులపై వాగ్వాదానికి దిగింది. తమ కారును ఆపే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మాస్కులు పెట్టుకోకుండా ప్రయాణించడం ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నా.. ‘‘అది మా ఇష్టం. అవసరమైతే కారులో నా భర్తను ముద్దుపెట్టుకుంటా’’ అని వ్యాఖ్యానించింది. జరిమానా చెల్లించాలని కోరిన పోలీసులను బిచ్చగాళ్లతో పోల్చింది. దీంతో పోలీసులు ఆ జంటపై కేసు నమోదు చేశారు. వారిని వెస్ట్ పటేల్ నగర్‌కు చెందిన పంకజ్, అభగా గుర్తించారు. పోలీసులు రికార్డు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.Untitled Document
Advertisements