గ్రేటర్ పోలీసులకు కరోనా టెన్షన్...వరసగా వైరస్ బారిన సిబ్బంది

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 07:48 PM

గ్రేటర్ పోలీసులకు కరోనా టెన్షన్...వరసగా వైరస్ బారిన  సిబ్బంది

హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇద్దరు పోలీసు అధికారులు కరోనా బారిన పడటంతో పోలీసు శాఖలో కలవరం మొదలైంది. బోయినపల్లిలో పనిచేస్తున్న ఏఎస్ఐ రాధాకృష్ణ, డబీర్‌పురా పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జితేందర్ కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.
ఏఎస్ఐ రాధాకృష్ణకి ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఏప్రిల్ 8వ తేదీన ఆస్పత్రిలో చేరారు. దీనికి తోడు ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్యం క్షీణించి సోమవారం మృతిచెందారు. హెడ్ కానిస్టేబుల్ జితేందర్ ఈ నెల ప్రారంభంలో కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగర పోలీసుల్లో కలవరం మొదలైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా సోకుతుండటంతో పోలీసులు భయంభయంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

Untitled Document
Advertisements