పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా ...తెలంగాణా సర్కార్ పై హై కోర్ట్ సీరియస్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 09:35 PM

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల, మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయం లో హైకోర్ట్ లో నేడు విచారణ జరిగింది. అయితే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించింది. సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్ లలో రద్దీ ను తగ్గించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం కి వరుస ప్రశ్నలు సంధించడం జరిగింది.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక లో కనీస వివరాలు ఉండటం లేదని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అంటూ సూటిగా ప్రశ్నించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం లో జన సంచారం నియంత్రణ కి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది అని ఎజీ కోర్ట్ కి తెలిపారు. కోర్ట్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతూ ఉంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంతుందా లేక ఆదేశాలు ఇవ్వమంటారా అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం నిర్ణయాలు త్వరగా తెలపాలని ప్రభుత్వం కోరింది.





Untitled Document
Advertisements