ప్రాణం నిలపాల్సిన ప్రాణవాయువే ప్రాణం తీసేస్తే!

     Written by : smtv Desk | Fri, Apr 23, 2021, 05:30 PM

ప్రాణం నిలపాల్సిన ప్రాణవాయువే ప్రాణం తీసేస్తే!

ప్రస్తుతం కరోనా కారణంగా చాల మంది ప్రాణాలుకోల్పోతున్నారు. ఒంట్లో వ్యాధిని ఎదుర్కునే శక్తిలేక కొందరు. జబ్బు లక్షణాలు గుర్తించక కొందరు. హా మాకేం అవుతుందిలే అని నిర్లలక్ష్యంతో కొందరు. ఇంకొందరు మరి దయనీయంగా ప్రాణం నిలపాల్సిన ఆక్సిజన్ అందక ఇలా ప్రాణాలు వదిలేస్తున్నారు. దేశంలోని స్మశానాలు శవాల గుట్టలుగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రాణ వాయువు అందక ఉపిరి నిలిచిపోవడం చూస్తుంటే మన భావితరాల పరిస్థితి ఏమిటా అనే ప్రశ్న నాలో తలెత్తింది. ఏంటి ఎవరో ఆక్సిజన్ దొరక్క చనిపోతే భావితరాల పరిస్థితికేంటి అని ఆలోచిస్తున్నారా? ఒక చిన్న కథ చెప్తా వినండి.

అది 20౩౦ సంవత్సరం

ఒక పేరున్న మహానగరం ఎప్పటిలాగే సంపన్న కుటుంబాలు ఉన్నాయి. ఎగువ, దిగువమధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. అన్ని కోటానుకోట్ల జనాభాలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబమే ప్రశాంత్ కుటుంబం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు ఊర్లో ఉన్నారు. ప్రశాంత్ ఒక కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పనిచేసేవాడు. అతని భార్య చరిత కూడా చుట్టు పక్కల అపార్ట్మెంట్ ల్లో పని చేసేది. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని విపత్తు ఎదురై అతను చేస్తున్న ఆ చిన్న ఉద్యోగం కాస్తా పోయింది.
ప్రశాంత్ నిరాశపడకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నాలుగు నెలలు గడిచిన అతనికి ఉద్యోగం దొరకట్లేదు. కాలం కలిసిరానప్పుడు తాడే పాము అయినట్టు చరిత ఒంట్లో బాగోలేక పనికేళ్ళడం మానేసింది. దాంతో అప్పటి వరకు కనీసం ఒక్కపూట అయిన తిని సర్దుకున్న ఆ కుటుంబం పరిస్థితి మరి దయనీయంగా మారింది. చరిత పని మానేసి అప్పటికే నెల రోజుల పైనే అయ్యింది దాచుకొన్న కొద్దిపాటి ఆక్సిజన్ అయిపోవచ్చింది. ( ఇక్కడ ఆక్సిజన్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా మనలాగా రాబోయే తరాలకి జీతం కాగితం రూపంలో ఉండదు. ఆక్సిజన్ రూపంలో ఉంటుంది.) ప్రశాంత్ ఉద్యోగం చేసినప్పుడు అతనికి నెలకి 50 కేజీల ఆక్సిజన్ జీతంగా ఇచ్చేవారు. చరిత ఇళ్ళలో పని చేసి నెలకి 15 కేజీల ఆక్సిజన్ సంపాదించేది. చరిత కూడా పనిచేయకపోవడంతో ప్రశాంత్ ఇంకా కొంచం గట్టిగా ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టాడు.
రోజంతా రోడ్ల వెంట తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చిన అతనికి మంచినీళ్ళు అందించిన అతని భార్య ఏమండీ భోజనం చేసి రెండు రోజులు అయ్యింది. పిల్లలు ఆకలి అంటున్నారు ఏంచేద్దామండీ అంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను చరిత కానీ ఎవరు పనివ్వట్లేదు అన్నాడు ప్రశాంత్ భాదగా. మీరు భాద పడకండి. ఇంట్లో 2 కేజీల ఆక్సిజన్ ఉంది రేపు అది తీసుకెళ్ళి ఇంట్లోకి తినడానికి ఏదైనా తీసుకురండి అంది చరిత. అయ్యో చరిత ఉన్న ఆక్సిజన్ ఇలా ఇచ్చేస్తే మరి పిల్లలకి నీకు ఎలాగా అన్నాడు ప్రశాంత్. పరవాలేదండి మా సిలిండర్లలో ఉన్న ఆక్సిజన్ రేపు రాత్రి 8 గంటల వరకు సరిపోతుంది. ఆ లోపు మీరు ఏదైనా పని వెతుక్కోండి అంటూ ప్రశాంత్ కి దైర్యం చెప్పి పడుకోబెట్టింది.
ఉదయం రాత్రి చెప్పినట్టుగానే ప్రశాంత్ కి రెండు కేజీల ఆక్సిజన్ ఇచ్చి పంపింది చరిత. ఆ ఆక్సిజన్ తీసుకుని షాపుకు వెళ్లి నలుగురికి సరిపడా పీజా, జ్యూస్ తీసుకున్నాడు ఇంకా 100 గ్రాముల ఆక్సిజన్ మిగిలింది ప్రశాంత్ దగ్గర.
రెండు రోజులుగా భోజనం చేయలేదు కదా ఏమైనా తిందాం అనుకుని హోటల్ కి వెళ్ళాడు అక్కడ మెనూ చూసాడు.
నూడిల్స్ - 500 గ్రాములు, పాస్తా- 400 గ్రాములు, కోక్- 200 గ్రాములు, గ్రీన్ టీ- 100 గ్రాములు అని ఉంది. దాంతో తన దగ్గర ఉన్న 100 గ్రాముల ఆక్సిజన్ తో ఒక గ్రీన్ టీ తాగాడు. షాప్ లో కొన్న పీజా, జ్యూస్ ఇంట్లో ఇద్దాం అని బయలుదేరాడు. దారిలో ఒక హోటల్ దగ్గర ఒక రోజు కోసం పనివాడు కావాలి అని బోర్డు కనిపించింది. ఆ బోర్డు చూసిన ప్రశాంత్ సంతోషంగా లోపలికి వెళ్లి ఆ పని చేయడానికి బేరం మాట్లాడసాగాడు.
హోటల్ యజమాని సాయంత్రం 6 గంటల వరకు ప్లేట్స్ కడిగితే నాలుగు కేజీల ఆక్సిజన్ ఇస్తాను అన్నాడు. ప్రశాంత్ 5 కేజీలు ఇవ్వమని బ్రతిమాలాడు. చివరకు 4.1/2 కేజీలకు బేరం కుదిరి పని మొదలు పెట్టాడు. ప్లేట్లు కడగడం మొదలుపెట్టగానే ఈ పని అనుకున్నంత సులువు కాదని అర్ధం అయ్యింది ప్రశాంత్ కి. 6 గంటలకల్లా పని పూర్తి చేసుకున్నాడు. ప్రశాంత్ పని నచ్చడంతో మాట్లడుకున్నదానికన్న ఎక్కువగా 5 కీజీల ఆక్సిజన్ ఇచ్చాడు ఆ యజమాని. అలాగే ప్రతిరోజు పనిలోకి రమ్మన్నాడు. మహానుభావుడు అనుకున్నదానికన్నా అరకేజీ ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చాడు, పైగా రోజు పనిలోకి రమ్మంటున్నాడు అనుకుని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని సంతోషంగా ఆ ఆక్సిజన్ తీసుకుని 7 గంటలు అవుతుండగా ఇంటికి బయలుదేరాడు. దారిలో ఈ విషయం చరితకు చెప్తే చాల సంతోషిస్తుంది అనుకుని ఉషారుగా ఇంటికి వెళ్తున్నాడు.
అలా ఆనందంగా ఇంటికి వెళుతున్న ప్రశాంత్ కు దారిలో చాల మంది మనుషులు సిలిండర్లలో ఆక్సిజన్ లేక రోడ్ల మీద చచ్చి శవాలుగా పడి కనిపించారు. ఆ శవాలను చూసి మా తాతల కాలంలో కాగితాలు సంపాదించుకుని చేతిలో సెల్ ఫోన్లు పట్టుకుని తిరుగుతూ దర్జగా బ్రతికేవారట. కాగితానికని, కలపకని, లగ్జరీ లైఫ్ కని, అవసరం ఉన్న లేకున్నా చెట్లని నరికేసేవారట. ఇక రియల్ ఎస్టేట్ పేరుతో పంటపోలాలని ఫ్లాట్లు గా మార్చి సొమ్ము కూడబెట్టుకున్నారు. మా గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఇప్పుడు మేము మాత్రం ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని తిరుగాల్సివస్తుంది. కనీసం దహన సంస్కారాలు కూడా లేవు ఎండా 100 డిగ్రీలకు దగ్గరగా ఉంటుంది కదా ఆ ఎండకే మాడి బొగైపోతాయి అనుకుని ఆ శవాలను చూస్తూ ఎదురుగా వచ్చే వాహనాన్ని చూసుకోలేదు. తృట్టిలో ప్రమాదం తప్పించుకుని పక్కన పడిపోయాడు ప్రశాంత్.
ఆ వాహనం వెళ్ళిపోయాక లేచి చుస్తే అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు కనిపించాయి. ప్రాణం అయితే పోలేదు కదా అనుకున్నాడు. అప్పటికే సమయం 7.40 అవుతుంది.మెల్లిగా పైకి లేచిన ప్రశాంత్ కి ఎక్కడో గాలి పోతున్న శబ్దం మెల్లిగా చెవిని చేరింది. తన ఆక్సిజన్ సిలిండర్ తీసి చూసుకున్నాడు. అంతే తన దరిద్రం పైన తనకే కోపం వచ్చింది. ఇందాక పక్కకు పడినప్పుడు సిలిండర్ కి హోల్ పడి అందులో నుండి ఆక్సిజన్ బయటకు పోతుంది. సమయం చూస్తే ఇంకా 20 నిమిషాలే ఉంది ఇంట్లో ఉన్న చరిత, పిల్లలు గుర్తొచ్చారు ఎలాగైనా వాళ్ళను బ్రతికించుకోవాలని పరుగు మొదలు పెట్టాడు. రెండు రోజులుగా తిండి లేకపోవడం వల్ల అతని కాళ్ళలో శక్తి సన్నగిల్లుతున్నా పరుగు ఆపకుండా అలాగే మొండిగా ముందుకు పరుగుపెట్టాడు. చివరికి ఎలాగో కష్టపడి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి చరిత, పిల్లలు కాలి సిలిండర్లు భుజానికి తగిలించుకుని నేలకొరిగారు. వారిని చూడగానే గుండెలు అవిసేలా ఏడ్చాడు ప్రశాంత్ ఏడుస్తూ ఇక్కడ తన సిలిండర్ లిక్ అయ్యి ఆక్సిజన్ పోతున్న పట్టించుకోకుండా నేను మీదగ్గరికే వస్తున్న అంటూ పిల్లలిద్దరిని తన బడిలో పడుకోబెట్టుకుని భార్య ఒడిలో పడుకుని ఊపిరి వదిలేసాడు ప్రశాంత్.

చూసారుగా ప్రతి చిన్న అవసరాలకు చెట్లను నరుక్కుంటూ పొతే రేపటి తరాల పరిస్థితి ఇదే.. దయ చేసి మీరు చెట్టు పెట్టినా పెట్టకున్న పరవాలేదు. ఉన్న వాటిని మాత్రం నరికేయడం మానేయండి. ప్రాణవాయువే ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో చూసారుగా.





Untitled Document
Advertisements