వాట్సప్‌లో సరికొత్త ఫీచర్స్...

     Written by : smtv Desk | Sun, Dec 17, 2017, 01:44 PM

వాట్సప్‌లో సరికొత్త ఫీచర్స్...

న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : వాట్సప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా మరో మూడు ఫీచర్‌లను వినియోగదారులకు అందించనున్నారు. అందులో ప్రైవేట్‌ రిప్లై, పీఐపీ మోడ్‌, ట్యాప్‌ టు ఆన్‌ బ్లాక్‌ ఫీచర్‌ లు రానున్నాయి.

*ప్రైవేట్‌ రిప్లై - గ్రూప్‌లో చాటింగ్‌ చేస్తున్న యూజర్‌లు వెనక్కి రాకుండానే అదే గ్రూప్‌లో ఉన్న ఎవరైనా యూజర్‌కు ప్రయివేట్‌గా మరో విండోలో మెసేజ్‌లు పంపవచ్చు. ఇందుకు గ్రూప్‌ చాట్‌ విండోలో ఉండే రిప్లై బటన్‌ను లాంగ్‌ప్రెస్‌ చేసి పట్టుకోవాలి.

*పీఐపీ మోడ్ - పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్. దీని ద్వారా వాట్సప్‌లో వీడియో కాల్‌ చేస్తున్నపుడు వీడియోలు చూస్తున్నపుడు వేరే కొత్త విండోలో అవి కనిపిస్తాయి.

*ట్యాప్‌ టు ఆన్‌ బ్లాక్‌ - యూజర్‌ పేరుపై ప్రెస్‌ చేసి పట్టుకుంటే వారిని వాట్సప్‌లో అన్‌ బ్లాక్‌ చేసేందుకు వీలుంటుంది.

కాగా ప్రస్తుతం ఈ ఫీచర్లన్ని వాట్సప్‌ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో అందరికి అందుబాటులోకి రానున్నాయి.





Untitled Document
Advertisements