పోర్టబుల్ వెంటిలేటర్...అద్భుత ఆవిష్కరణ

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:46 PM

పోర్టబుల్ వెంటిలేటర్...అద్భుత ఆవిష్కరణ

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. భారత్‌లో నిత్యం లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా రోగులకు ఆస్పత్రులు, బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ అవసరమైన మేరకు అందడం లేదు. చాలామందికి కరోనా నుంచి కోలుకునే క్రమంలో వెంటిలేటర్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈక్రమంలో పోర్టబుల్ వెంటిలేటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని మనం ఇంట్లోకూడా ఈజీగా వినియోగించుకోవచ్చు.

హైదరాబాదుకు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ... సీఎస్ఐఆర్, నేషనల్ ఏరోస్సేస్ ల్యాబ్స్ సహకారంతో ఈ పోర్టబుల్ వెంటిలేటర్ ను రూపొందించింది. దీనికి 'స్వస్థ్ వాయు ఇన్వాజివ్ వెంటిలేటర్' గా నామకరణం చేశారు. ఇది ఓ బ్రీఫ్ కేసు పరిమాణంలో ఉంటుంది. ఈ వెంటిలేటర్ మూడు కిలోల కన్నా తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఇళ్లలో సులువుగా ఉపయోగించుకోవచ్చు.

దీనిపై అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ అధినేత బద్దం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాదుతో పాటు బెంగళూరు నగరంలోనూ ఈ మినీ వెంటిలేటర్ ను ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్టు తెలిపారు.
దీన్ని కరోనా బాధితులకే కాదు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఉపయోగించవచ్చని సంస్థ ప్రతినిధులు వివరించారు.





Untitled Document
Advertisements