ఎడమ చేతి వాటం ఎలా?

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:51 PM

ఎడమ చేతి వాటం ఎలా?

ప్రపంచ జనాభాలో దాదాపు ఆరు శాతం మంది ఎడమ చేతి వాటం కలవారని తెలుస్తుంది. ఎడమచేతి వాటం ఉన్న వారిలో ప్రఖ్యాతి గాంచిన శిల్పులు లియో నార్డోడావిన్సీ మైఖెలాంజిలో లాంటి వారున్నారు. మెదడు మొత్తం ఒకే భాగంగా ఉండి తన విధులు నిర్వర్తించదు. కుడి అర్ద గోళం, ఎడమ అర్దగోళంగా విడివిడిగా కార్యనిర్వహణ చేస్తాయి.ఈ రెండింటి పనితీరులో కూడా తేడా ఉంటుంది. సర్వసాధారణంగా ఎడమ మస్తిష్క అర్దగోళం కంటే చురుకుగా ఉంటుంది. ఇక ఎడమ శరీరభాగాలు కుడి అర్ధగోళ అధీనంలో,కుడి శరీర భాగాలు ఎడమ అర్దగోళంలో ఉంటాయి. ఎడమ అర్దగోళం చురుకుదనం వల్ల కుడి శరీర భాగాలు చదవడం, రాయడం, మాట్లాడం, ఇతర పనులు చేయడంలో ముందుంటాయి. అయితే కొద్దిమందిలో కుడి అర్ద గోళం ఎక్కువ చరుగ్గా ఉండి, ఎడమ అర్దగోళంపై అధిక్యత సాధిస్తుంది. అలాంటి వారు ఎడమచేతి వాటంగా ఉంటారు.





Untitled Document
Advertisements