ఉల్లిపాయలు తరిగితే కన్నీళ్ళు ఎందుకోస్తాయి?

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:52 PM

ఉల్లిపాయలు తరిగితే కన్నీళ్ళు ఎందుకోస్తాయి?

ఇంటిపని ఎంత ఉన్న సరే అలసిపోకుండా చేసేస్తారు. కిచెన్లో ఎంతసేపు అయినా, ఎన్ని వంటలు చేయమన్నా అలుపు లేకుండా చేసేస్తారు. కూరగాయాలు ఎన్నైనా, ఏవైనా చకచక తరిగేస్తారు. ఇన్ని పనుకు అవలీలగా చేసేసే గృహిణి ఒక్క ఉల్లిపాయను చూస్తే చాలు బాబోయి ఇప్పుడు దీన్ని నేను తరగాల అని ఏడుపు మొహం పెట్టేస్తుంటారు. ఇంట్లో అందరిని కాస్త ఈ ఉల్లిపాయలు తరిగిపెట్టారు అంటూ బ్రతిమాలుతూ ఉంటారు. కారణం ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళు మండుతుంటాయి, కళ్ళ వెంట నీరుకారుతుంది. ఉల్లిపాయాలలో మన కళ్ళను మండించే గుణం గల ఒక పదార్థం ఉంది. దాని పేరు ' ప్రోఫిన్ సల్ఫిసిన్ '. ఉల్లిపాయను కోయగానే దానిలో ఉన్న ఈ పదార్థం గాలిలో కలుస్తుంది. ఆ గాలి మన కంటికి తగులుతుంది. కళ్ళను మండిస్తుంది. వెంటనే మన కళ్ళ నుంచి నీరు కారుతుంది. ఇలా కళ్ళలో నుంచి నీరు కారడం మంచిదే. ఎందుకంటే గాలిలో ఉన్న ధూళికణాలు మన కంటిలోకి చేరుతాయి. ఈ ధూళి కణాలు కళ్ళలో నుండి వచ్చే నీటితో పాటు బయటకు వస్తాయి. కళ్ళ మంటకు కారణం ఏదైనా సరే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామేత నిజమే మన ఆరోగ్యానికి ఉల్లి ఒక ఔషధంలా పనిచేస్తుంది అనేది నిజం.





Untitled Document
Advertisements