కొత్త స్కీమ్….రేపు ఒక్క రోజు ఛాన్స్

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:30 PM

కొత్త స్కీమ్….రేపు ఒక్క రోజు ఛాన్స్

అదిరిపోయే రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇప్పుడు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. కెనరా రొబెకో ఇటీవల ఫోకస్ట్ ఈక్విటీ ఫండ్ ఆవిష్కరించింది. ఈ ఫండ్ ఎన్ఎఫ్‌వో రేపటితో ముగుస్తుంది. ఎవరైనాసరే ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

మీరు ప్రతి నెలా సిప్ రూపంలో కూడా ఈ ఫండ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.1000తో ఇప్పుడు ఈ ఫండ్ స్కీమ్‌లో చేరొచ్చు. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఎప్పుడైనా చేరొచ్చు. అలాగే ఎప్పుడైనా స్కీమ్ నుంచి బయటకు రావొచ్చు. అయితే ఫండ్ ఎన్ఏవీ ప్రాతిపదికన మీ ఇన్వెస్ట్‌మెంట్ మారుతుంది.

కొత్త స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒకే సారి రూ.5 వేలు పెట్టి చేరొచ్చు. అదే సిప్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.1000తో స్కీమ్‌లో జాయిన్ కావొచ్చు. మీరు ఈ ఫండ్‌లో చేరాలని భావిస్తే.. నేరుగా సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి చేరితే సరిపోతుంది. అక్కడి నుంచే నేరుగా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టాలని భావిస్తే.. ఈ ఎన్ఎఫ్‌వో మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫండ్ ఎక్కువ డబ్బులను ఈక్విటీ మార్కెట్‌లోనే పెడుతుంది. కనీసం 65 శాతం మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అందువల్ల దీర్ఘకాలంలో డబ్బులు పెట్టాలని భావించే వారు ఈ ఫండ్‌లో చేరొచ్చు.





Untitled Document
Advertisements