వ్యాక్సిన్ వేయించుకున్న గబ్బర్

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:34 PM

వ్యాక్సిన్ వేయించుకున్న గబ్బర్

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి ఆడిన శిఖర్ ధావన్.. 8 మ్యాచ్‌ల్లోనే 380 పరుగులు చేసి సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. ఐపీఎల్‌లోని కొన్ని జట్లలో కరోనా కేసులు నమోదవడంతో సీజన్‌ని నిరవధికంగా బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 29 మ్యాచ్‌లను మాత్రమే నిర్వహించారు.

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. శిఖర్ ధావన్ తన వంతుగా రూ.20 లక్షల్ని ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం విరాళంగా ఇచ్చాడు. అలానే ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్రైజ్‌మనీ రూపంలో వచ్చే మొత్తాన్ని కూడా విరాళంగా ఇస్తున్నట్లు గబ్బర్ ప్రకటించాడు. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్న గబ్బర్.. తాజాగా వాక్సిన్ వేయించుకున్నాడు.

‘‘వ్యాక్సిన్ వేయించుకున్నా. ఈ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ చేస్తున్న త్యాగాలకి, చూపుతున్న నిబద్ధతకి కేవలం థ్యాంక్స్‌ చెప్పడం సరికాదు. మీరు కూడా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి. అది కరోనా పోరాటంలో మీకు సాయపడుతుంది’’ అని శిఖర్ ధావన్ సూచించాడు.

Untitled Document
Advertisements