"జగన్ బొక్క చేసాడు"...YCP ఎంపీ

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:43 PM


ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ రూపంలో వైరస్ విస్తరిస్తోంది.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, పలువురు స్థానిక నేతలు ఓ ఇంట్లో కలిశారు. కరోనా సంక్షోభం గురించి మాట్లాడుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి రూ. 30 వేలు, దహనసంస్కారాలకు రూ. 12 వేలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు ఏం చేశారు.. చేతులెత్తేశారు అంటూ నేతలు మాట్లాడిన వీడియో బయటపడింది. దీన్ని టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.. వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేశారు. ‘రాష్ట్రంలో కరోన నుండి ప్రజల ప్రాణాలను కాపాడడంలో చేతులు ఎత్తేసిన జగన్ అంటూ.. మాట్లాడుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు’వీడియోను ట్వీట్ చేశారు. తెలుగు తమ్ముళ్లు కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కరోనా విషయంలో చేతులెత్తేశారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించాల్సి ఉంది.
Untitled Document
Advertisements