ఉపాసన అంటే?

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:45 PM

ఉపాసన అంటే?

ఉపాసన, ఉపాసన అంటే పూజించుట, చింతన మొదలైన అర్ధాలు ఉన్నాయి. ఇది సగుణోపాసన, నిర్గుణోపాసన అని రెండు విధాలు. సగుణోపాసన అంతే ప్రతీక ఆధారంగానో, దైవానికి వర్తించే కొన్ని గుణాలను తీసుకొని ఉపాసించుట. విగ్రహాన్ని పూజించటం, వాయువు, అగ్ని మొదలైన వాటిలో పరమాత్మను చూడటం, వేదంలోనో, పురాణాది గ్రంధాలలోనో ప్రస్తావనకు వచ్చే కొందరు దేవతలను వారి వారి గుణాలను, లక్షణాలను మనస్సులో ఉంచుకొని ఆరాధించటం కూడా సుగుణోపాసన. విగ్రహాన్ని లేదా ప్రతీకను ఆరాధించడం అధ్యాసోపాసన. దైవగుణాలను వర్ణిస్తూ చేసే ఉపాసన సంపదుపాసన. గుణాలకు అతీతుడైన బ్రహ్మను లేదా పరమాత్మను ఉపాసించుట నిర్గుణోపాసన. ఉపాసన్ చేసేవాళ్ళు ఉపాసకులు. ఏయే లక్షణాలను, గుణాలను వర్ణిస్తూ దేవతలను ఉపాసిస్తారో అవే లక్షణాలతో, గుణాలతో దైవం సాక్షత్కరించడం, అవే లక్షణాలు, గుణాలు ఉపాసనకులలో వ్యక్తం కావడం సాధకుల అనుభవం.

Untitled Document
Advertisements