రూ.5 పెరగనున్న పెట్రోల్ రేటు

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 06:39 PM

రూ.5 పెరగనున్న పెట్రోల్ రేటు

వాహనదారులకు భారీ షాక్. ఎందుకంటారా? ఒక షాకింగ్ రిపోర్ట్ వెల్లడైంది. పెట్రోల్ ధర భారీగా పెరగనుందని ఈ నివేదిక చెబుతోంది. దీని ప్రకారం చూస్తే.. పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ.5 పెరగనుంది. వాహనదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.100కు చేరువలో ఉంది. ఇక డీజిల్ ధర అయితే రూ.90 సమీపంలో కదలాడుతోంది. ఇవే గరిష్ట ధరలు అనుకుంటే.. ఇంధన ధరలు మరింత పెరగనున్నాయనే నివేదిక వెలువడటంతో అందరూ షాక్‌కు గురవుతున్నారని చెప్పొచ్చు.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను పూడ్చుకోవడానికి మార్జిన్లను కరెక్ట్ చేసుకోనున్నాయని క్రెడిట్ సూసీ తెలిపింది. ధరల పెరుగుదల వల్ల నష్టాలు పూడ్చుకోనున్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ధర లీటరుకు రూ.5.5, డీజిల్ ధర లీటరుకు రూ.3 మేర పెరగనుందని నివేదికలో పేర్కొంది.

కాగా పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలలుగా పెద్దగా పెరగలేదు. కానీ గత మూడు రోజులుగా మాత్రం పెరుగుతూనే వస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపించడం ప్రారంభించాయి. అందుకే మూడు రోజులుగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.

Untitled Document
Advertisements