ఎంఐ 67W ఫాస్ట్ చార్జర్‌

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 08:02 PM

ఎంఐ 67W ఫాస్ట్ చార్జర్‌

ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 67W ఫాస్ట్ చార్జర్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని షియోమీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గత నెలలో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్‌తో పాటు 67W చార్జర్ కాకుండా 55W చార్జర్‌ను కంపెనీ అందిస్తోంది. సర్టిఫికేషన్ సమస్యల కారణంగా 67W చార్జర్‌ను అందించలేకపోతున్నామని కంపెనీ తెలిపింది. 0 నుంచి 99 శాతానికి కేవలం గంటలోనే ఈ చార్జర్ ద్వారా చార్జ్ అవుతుంది.

త్వరలో 67W వైర్డ్ చార్జర్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని మొదట మైస్మార్ట్‌ప్రైస్ తెలిపింది. అయితే ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌తో ఈ చార్జర్ రాదు. దీన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎంఐ 11 అల్ట్రా గ్లోబల్ యూనిట్‌తో పాటు ఈ చార్జర్‌నే అందిస్తున్నారు. మనదేశంలో మాత్రం 55W చార్జర్‌ను ఫోన్‌తో పాటు అందిస్తున్నారు.

ఈ 67W ఫాస్ట్ చార్జర్ ధరను షియోమీ ఇంకా ప్రకటించలేదు. ఎంఐ 11 అల్ట్రా 67W వైర్ లెస్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ మనదేశంలో గత నెలలో లాంచ్ అయింది. కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.69,999గా ఉంది.


ఎంఐ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఎంఐ 11 అల్ట్రా పనిచేయనుంది. ఇందులో 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లేను కంపెనీ అందించింది. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు 1.1 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 10W రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్2 సెన్సార్‌ను అందించడటం విశేషం. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ టెలి మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ మూడు సెన్సార్లూ 8కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేయడం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 234 గ్రాములుగా ఉంది.

Untitled Document
Advertisements