ఒకే గ్రామంలో 28 మంది మృతి

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 09:19 PM

ఒకే గ్రామంలో 28 మంది మృతి

హ‌ర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కొద్దిరోజుల వ్యవధిలోనే ఒకే గ్రామంలో ఏకంగా 28 మంది అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. రోహ్‌తక్ జిల్లా టిటోలి గ్రామంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గ్రామాన్ని దిగ్భందం చేసింది. వీరందరి మరణాలకు కరోనా వైరస్సే కారణమని భావించి అధికారులు ఇతర గ్రామాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మొత్తం గ్రామాన్నే కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

గ్రామంలో కొద్దిరోజుల నుంచి వరుసగా మరణాల సంభవిస్తున్నాయి. వీరిలో చాలామందికి మరణించేందుకు రెండు మూడు రోజుల పాటు జ్వరంతో బాధపడినట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు గ్రామాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. వీరంతా కరోనా వల్లే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో టిటోలి గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. గ్రామస్థులను బయటి ప్రాంతాలకు అనుమతించని అధికారులు.. ఇతర గ్రామాల నుంచి ఎవరినీ అనుమతించడం లేదు. బుధవారం 80 మందికి పరీక్షలు నిర్వహించగా 21 మందికి పాజిటివ్‌గా తేలింది.

Untitled Document
Advertisements