వెబ్ వెర్షన్లను లాంచ్ చేసిన "జియో"

     Written by : smtv Desk | Mon, Dec 18, 2017, 07:16 PM

వెబ్ వెర్షన్లను లాంచ్ చేసిన

ముంబై, డిసెంబర్ 18 : ప్రముఖ రిలయన్స్ సంస్థ.. జియో టీవీ, జియో సినిమా యాప్‌లకు వెబ్ వెర్షన్లను లాంచ్ చేసింది. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన టీవీ ఛానళ్లు, సినిమాలు చూసే అవకాశాన్ని కలిగించింది. దీనికి చేయవలసిందల్లా తమ జియో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది.

అలాగే వై-ఫై, మొబైల్ నెట్‌వర్క్ ద్వారా కూడా జియో టీవీ, జియో సినిమాలను కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో చూసే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం రిలయన్స్.. హాట్‌స్టార్ వంటి వాటితో జియో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా వెబ్‌సైట్ ద్వారానే క్రికెట్ వంటి వాటిని లైవ్‌లో చూసే వీలు కల్పించింది.





Untitled Document
Advertisements