పేస్ బుక్ లో మరో కొత్త ఫీచర్...

     Written by : smtv Desk | Thu, Dec 21, 2017, 10:52 AM

పేస్ బుక్ లో మరో కొత్త ఫీచర్...

హ్యూస్టన్‌, డిసెంబర్ 21: సామాజిక మాధ్యమాలలో పేస్ బుక్ తీరే వేరు. అందులో తలెత్తుతున్న సమస్యలపై ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పుడు కూడా పేస్ బుక్ లో అపరిచితుల “ఫ్రెండ్ రిక్వెస్ట్” లను, వేధింపులను నిలువరించడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీని కోసం పేస్ బుక్ దిల్లీ, అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలతో ఒప్పంద కుదుర్చుకొని ఈ రంగం సిద్దం చేశారు. నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి, తొలగించేందుకు, అక్కర్లేని సందేశాలనూ అడ్డుకునేలా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చామని, ఒకసారి దీన్ని క్రియాశీలం చేస్తే సంబంధిత వ్యక్తి పంపిన సందేశాలపై ఎలాంటి నోటిఫికేషన్లూ రావని, ఆ సందేశాలన్నీ ప్రత్యేక ఫోల్డర్‌లోకి వెళ్లిపోతాయని, కావాలంటే అక్కడ వాటిని పంపిన వ్యక్తికి తెలియకుండా చదివే వీలుందని, త్వరలో గ్రూపుల్లోని సందేశాలకూ ఈ వీలును కల్పించామని పేస్ బుక్ సంస్థ వెల్లడించింది.





Untitled Document
Advertisements