పూజకి ఎటువంటి సామాగ్రిని ఉపయోగించాలి

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 11:35 AM

పూజకి ఎటువంటి సామాగ్రిని ఉపయోగించాలి

పూజ చేసేందుకు ప్రత్యేక వాతావరణం, మానసిక స్థితి అవసరం. భగవంతుని సాదరంగా ఆహ్వానించడం, తమ ఆదరణ అందుకోమని ప్రార్ధించడం చేస్తారు. హిందువుల ఇళ్ళలో, దేవాలయాలలోపూజ కోసం ప్రత్యేక సామాగ్రి నిర్దేశించారు. వాటిని కంచు, రాగి వంటి లోహాలతో ప్రత్యేక పద్దతిలో, నిర్దిష్ట రూపంలో తయారు చేస్తారు. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి కొద్దిగా తేడా ఉన్నప్పటికీ ప్రధానంగా ఉపయోగించే సామాగ్రి ఒక్కటే.
ధారపాత్ర:- ఇది ఇళ్ళలో కన్నా దేవాలయాలలో కనిపిస్తుంది. శివలింగం మీద నిత్య అభిషేకం కోసం ఏర్పాటు చేసినది. ఇది త్రిభుజ ఆకారంలో పైన వెడల్పుగా కింద మొనతేలి వుంటుంది. మొనతేలిన ప్రదేశంలో గోముఖం అమరుస్తారు. దీనిగుండా అభిషేకం చేసే నీరు చుక్కలుగా లేదా ధారగా శివలింగం మీదకి జారుతుంది.
కుంది:- దీపారాధన వెలిగించేందుకు వాడే కుంది చిన్నవి, పెద్దవిగా ఉంటాయి. దేవాలయంలో పెద్దవి వాడతారు. వాటిలో ఐడు ఒత్తులు వెలిగించేందుకు వీలుగా పుష్పంలాంటి భాగం పై ఎత్తున వుంటుంది. ఈ కుండీల రూపాలు బిన్నంగా వుంటాయి. కొన్ని ప్రాంతాలలో దీపలక్ష్మి కుందులు వాడతారు. అది దేవతామూర్తి రూపంలో వున్నా కుంది.
ఆరతి:- ఆరతి ఇచ్చేందుకు ప్రత్యేకంగా చేయించిన వస్తువు ఉంటుంది. ఒత్తులు వెలిగించి దేవునికి ఆరతి ఇచ్చేందుకు పట్టుకొనుటకు పీటభాగం వుంటుంది. హారతి భగవంతునికి ఇచ్చి, భక్తుల కళ్ళకు అద్దుకుని నమస్కరించుకునేందుకు ఇస్తారు.
పంచపాత్ర:- పూజకు ముందు ఆచమనం చేసేందుకు పవిత్ర జలం లేదా పాలను పోసి ఉంచుకునే రాగి పాత్ర.





Untitled Document
Advertisements