థియేటర్స్ ఓపెన్!

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:17 PM

థియేటర్స్ ఓపెన్!

కరోనా దెబ్బకి ఇండస్ట్రీ కుదేలైంది. షూటింగ్‌లు వాయిదా పడటంతో పాటు.. విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. తెలంగాణలో జూలై 1 నుంచి థియేటర్స్ తలుపులు ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూలై 1 నుంచి థియేటర్స్ వద్ద సందడి కనిపించబోతుంది.
అయితే కేవలం 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో మాత్రమే అనుమతి లభించే అవకాశం ఉంది. ఇక తెలంగాణతో పాటు ఏపీలోనూ జూలై 1న థియేటర్స్ తెరుచుకునే అవకాశం ఉంది. ఇకపోతే థియేటర్స్ ఓపెన్ అయితే థియేటర్స్ వద్ద సినిమాల జాతరే ఉండబోతుంది. ఎందుకంటే గత ఏప్రిల్ నెల నుంచి రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిగా థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదల కాగా.. హిట్ టాక్ వచ్చిన సినిమా కూడా కలెక్షన్లలో వెనకబడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు వాయిదా పడ్డాయి.

ఈ లిస్ట్ చూస్తే.. శేఖ‌ర్ క‌మ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా న‌టించిన ‘ల‌వ్ స్టోరీ’.. నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెరెక్కించిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, రానా-సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో వేణు ఉడుగుల తెర‌కెక్కించిన ‘విరాట ప‌ర్వం’, చిరంజీవి- కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లలో కొర‌టాల తెర‌కెక్కించిన ‘ఆచార్య’, వెంక‌టేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో రూపొందిన ‘నార‌ప్ప‌’, మాస్ మహారాజా రవితేజ – రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘ఖిలాడి’, గోపీచంద్- త‌మ‌న్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన ‘సీటీమార్’, విశ్వక్ సేన్ ‘పాగ‌ల్’, తేజా సజ్జా – ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా న‌టించిన ఇష్క్ చిత్రాలు వాయిదా పడ్డాయి. వీటితో పాటు చిన్నా చితకా చిత్రాల లిస్ట్ కూడా పెద్దదే ఉంది.

అయితే జూలై 1 నుంచి థియేటర్స్ తలుపులు తెరుచుకుంటూ సినిమా జాతర మొదలవ్వబోతుంది. అయితే కరోనా తరువాత ప్రేక్షకులు తిరిగి థియేటర్స్‌కి వచ్చే సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విషయంలోనే వెనుకడుగు వేసిన ప్రేక్షకులు.. సాహసించి థియేటర్స్‌కి రావడం అనేది కష్టంగానే కనిపిస్తోంది.





Untitled Document
Advertisements