రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్...ఆ డబ్బులు వెనక్కి

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:39 PM

రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్...ఆ డబ్బులు వెనక్కి

దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. రుణ గ్రహీతలకు ఊరట కలిగే ప్రకనట చేసింది. వాహన రుణాలు పొందిన కస్టమర్లకు జీపీఎస్ డివైజ్ కమిషన్ రిఫండ్ చేస్తామని తెలిపింది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది.

వాహన రుణాలు పొందిన వారు జీపీఎస్ డివైజ్ తీసుకొని ఉంటే.. వారికి ఆ డబ్బులు రిఫండ్ వస్తాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు తీసుకున్న వాహన రుణాలకు ఇది వర్తిస్తుంది. రిఫండ్ డబ్బులు కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.


ఒకవేళ కస్టమర్ల రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ అయి ఉంటే.. కస్టమర్లు బ్యాంక్ అధికారులను సంప్రదించొచ్చని బ్యాంక్ తెలిపింది. లేదంటే ఈమెయిల్ పంపడం, ఫోన్ కాల్ చేయడం వంటివి చేయాలని కోరింది. ఇందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెల రోజుల్లో గడువు ఇచ్చింది.

వాహన రుణాల్లో అవకతవకలు కారణంగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రూ.10 కోట్ల పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ వాహన రుణాలు పొందిన కస్టమర్లకు జీపీఎస్ డివైజ్ కమిషన్ రిఫండ్ చేస్తుండటం గమనార్హం.





Untitled Document
Advertisements