ఏఏ రోజుల్లో క్షుర కర్మ చేయించుకోవాలి?

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:49 PM

ఏఏ రోజుల్లో క్షుర కర్మ చేయించుకోవాలి?

గడ్డం గీసుకోవడం, తల వెంట్రుకలు కత్తిరించుకోవడం వంటి పనులకు సోమ, బుధ, గురువారాలందు మంచిది. ఆదివారము, శనివారము క్షురకర్మ మంచిదికాదు. మొదట గడ్డం గీయించుకుని ఆ పై చంకలూ, ఆ తర్వాత క్షౌరం చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వల్ల కుటుంబ వృద్దిజరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గోళ్ళు, మీసాలూ, రోమాలు ప్రతి ఐదు రోజుల కొకసారి కత్తిరించుకోవాలి. ముక్కులోని వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. దానివల్ల కంటికి ఇబ్బంది. మనం పీల్చేగాలిలో అనేక విష క్రిములుంటాయి. వాటిని పసిగట్టి ఆపి.. మంచిగాలిని లోపలికి పంపించేవే ముక్కులోని వెంట్రుకలు. అలాగే క్షురకర్మలు పాడ్యమీ, చవితి, షష్టి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథులందు చేయించుకోకూడదు.





Untitled Document
Advertisements