"తొలి సంపాదన రూ.500"

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 04:50 PM


ఎంతటి వారైనా సరే వారి మొదటి సంపాదన ఎప్పటికీ ప్రత్యేకమే. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తున్నా సరే ప్రారంభంలో అర్జించిన వంద రూపాయలు కూడా ఎంతో గొప్పే. అందుకే అందరూ కూడా తమ తొలి సంపాదన గురించి ఎంతో గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కూడా తన తొలి రెమ్యూనరేషన్ గురించి బయటపెట్టేశారు. విద్యా బాలన్ ప్రస్తుతం షేర్నీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లోనే భాగంగా విద్యా బాలన్ తన తొలి సంపాదన గుట్టు విప్పారు.

ఓ టూరిస్ట్‌ క్యాంపైన్‌ కోసం మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను. నా సోదరి, మరో కజిన్‌ ఫ్రెండ్‌తో కలిసి టూరిస్ట్‌ క్యాంపైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. మేమంతా కలిసి ఓ చెట్టు పక్కన నిల్చుని.. చిరునవ్వులు చిందిస్తుండాలి. ఆ విధంగా ఫొటోకు పోజులిచ్చినందుకు మాకు తలో రూ.500 చెల్లించారు. అదే నా తొలి సంపాదన అంటూ అసలు విషయం చెప్పారు.

ఓ ధారావాహికతో తాను మొదటిసారి నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని విద్యా బాలన్ తెలిపారు. ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయని, ధారావాహిక ఆడిషన్స్ కోసం మా అమ్మ, సోదరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లానని అన్నారు. రోజంతా అక్కడే వేచి చూశామని, సుమారు 150 మంది వరకూ ఆడిషన్స్‌కి వచ్చారని తెలిపారు. తనకు అవకాశం రాకపోవచ్చు అనుకున్నానని కానీ, అదృష్టం కొద్ది అందులో నటించే ఛాన్స్ దొరికిందని విద్యా బాలన్ తెలిపారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు విద్యా బాలన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. డర్టీ పిక్చర్ సినిమాతో విద్యా బాలన్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది.

Untitled Document
Advertisements