వాహనదారులకు ఝలక్...పాత వాహనాలు నడిపితే రూ.10 వేలు ఫైన్

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 09:16 PM

వాహనదారులకు ఝలక్...పాత వాహనాలు నడిపితే రూ.10 వేలు ఫైన్

పర్యావరణ కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్రాలు కూడా దృష్టి కేంద్రీకరించాయి. అందుకే మోదీ సర్కార్ ఇటీవల స్క్రాపేజ్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి వాటి పాలసీలను అనుసరిస్తున్నాయి. అందువల్ల పాత వాహనాలు వాడే వారు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ఆవిష్కరించింది. 15 ఏళ్ల నాటి పెట్రోల్ వెహికల్స్, 10 ఏళ్ల నాటి డీజిల్ వెహికల్స్‌పై నిషేధం విధించింది. ఈ కార్లను రోడ్లపై నడిపితే రూ.10 వేల జరిమానా విధిస్తోంది. ఎవరైనాసరే పాత వెహికల్స్ నడిపితే పెనాల్టీ కట్టాల్సిందేనని పేర్కొంది. అంతేకాకుండా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు రోడ్డుపై పాత వెహికల్స్ కనిపిస్తే.. ఇలాంటి వాహనాలను స్క్రాపేజ్ సెంటర్‌కు పంపే అధికారం కూడా ఉంటుందని గుమనించాలి. కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం స్క్రాపేజ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇకపోతే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి పాలసీలను అమలులోకి తీసుకువచ్చే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

Untitled Document
Advertisements