జియో నుంచి రెండు హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ విడుదల..!

     Written by : smtv Desk | Sat, Dec 23, 2017, 03:15 PM

జియో నుంచి రెండు హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ విడుదల..!

ముంబై, డిసెంబర్ 23: అద్భుత ఆఫర్లతో దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి౦ది రిలయన్స్ జియో. డిజిటల్ లైఫ్ పేరుతో తక్కువ రేట్లకే మొబైల్ డేటా, ఉచిత కాల్స్, సందేశాలను అందించి అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసింది. తాజాగా రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం హ్యాపీ న్యూ ఇయర్ 2018 పేరిట రెండు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ.199, రూ.299 ప్లాన్లు ఇప్పుడు జియో వినియోగదారులకు లభిస్తాయి.

ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులు ఉండగా, రెండింటిలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. ఇక రూ.199 ప్లాన్‌లో రోజుకు 1.2 జీబీ డేటా లభి౦చనుండగా అదే రూ.299 ప్లాన్‌లో అయితే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు రూ.199 ప్లాన్‌లను లాంచ్ చేసిన నేపథ్యంలో జియో వాటికి పోటీగా ఈ రెండు కొత్త ప్లాన్‌లను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రంగంలో అత్యధిక పోటీ నేపధ్యంలో జియో నుంచి మున్ముందు ఎలాంటి ఆఫర్లు వస్తాయో వేచిచూడాలి.





Untitled Document
Advertisements