నష్టాన్ని పూడ్చుకునే పనిలో వీడియోకాన్‌

     Written by : smtv Desk | Sat, Dec 23, 2017, 03:56 PM

నష్టాన్ని పూడ్చుకునే పనిలో వీడియోకాన్‌

న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించిన '2జీ స్పెక్ట్రమ్‌' కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు మాజీ టెలికాం మంత్రి ఏ. రాజా, కనిమౌళితో సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే . ఈ తీర్పు నేపధ్యంలో వీడియోకాన్‌ టెలికాం సంస్థ ప్రభుత్వం నుంచి తన నష్టాన్ని తిరిగి ప్రభుత్వం ద్వారా దక్కించుకొనే౦దుకు ప్రయత్నాలు ఆరంభించింది.

2012లో 2జీ స్పెక్ట్రమ్‌ కేసును జస్టిస్‌ సంఘ్వీ, జస్టిస్‌ ఏకే గంగూలీతో కూడిన ధర్మాసనం విచారించింది. టెలికాం మంత్రి రాజా మంజూరు చేసిన 122 లైసెన్సులు అక్రమం అని పేర్కొంటూ వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో వీడియోకాన్‌ లైసెన్సులు కూడా ఉండడంతో ఈ తీర్పు వల్ల తమ వ్యాపారానికి నష్టం జరిగిందని 2015లో వీడియోకాన్‌ టెలికాం ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించింది. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని వీడియోకాన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి రూ. 10వేల కోట్ల వరకు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు తెలిపారు.





Untitled Document
Advertisements