వోడాఫోన్ నుంచి మరో కొత్త ఆఫర్...

     Written by : smtv Desk | Sun, Dec 24, 2017, 07:10 PM

వోడాఫోన్ నుంచి మరో కొత్త ఆఫర్...

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 24: రిలయన్స్ జియో ప్రవేశపెడుతున్న ఆఫర్ల నుంచి తమ ప్రీపెయిడ్ వినియోగదారులను రక్షించుకునేందుకు ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థ వోడాఫోన్ మరో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. రూ.198 రీఛార్జ్‌ చేయించుకుంటే 28రోజులు కాలపరిమితితో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. నూతన వినియోగదారులు సైతం ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే మొదటగా రూ.299 రీఛార్జ్‌ తో ఈ ఆఫర్‌లోని లాభాలను పొందవచ్చని సంస్థ కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అనీశ్‌ కోస్లా వెల్లడించారు. వొడాఫోన్‌ అన్ని 4జీ సర్కిళ్లల్లోనూ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, రోమింగ్‌లో కూడా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను వినియోగదారులు పొందే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

Untitled Document
Advertisements