వాహనాలను 5% జీఎస్టీ శ్లాబులో చేర్చాలి...

     Written by : smtv Desk | Mon, Dec 25, 2017, 02:22 PM

వాహనాలను 5% జీఎస్టీ శ్లాబులో చేర్చాలి...

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారత ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సంఘం (సియామ్‌), విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే వ్యక్తులకు ఒకసారి ఆదాయపు పన్నులో తగ్గింపు కల్పించాలని సూచించింది. అంతేకాదు ఇందులో వాహనాలను 5శాతం జీఎస్టీ శ్లాబులో చేర్చాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అందించిన శ్వేతపత్రంలో... "ఓ వస్తువును ప్రారంభించేప్పుడు ప్రోత్సహకాలు, నగదు రాయితీలు ఇస్తుంటారు. అవి స్వల్పకాలిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే ఇలా పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి" అని సియామ్‌ పేర్కొంది. ఈ వాహనాల గరిష్ఠ ధర రూ.25లక్షలు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో పాటు ఆ వాహనాలకు రోడ్డు ట్యాక్సులను కూడా మినహాయించాలని కోరింది.

Untitled Document
Advertisements